Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘Toxic’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఊహించని ప్రమాదం జరిగి పలువురు గాయపడిన ఘటనపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యంతో పాటు ఈవెంట్ మేనేజర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Toxic’ ప్రీ-రిలీజ్ వేడుక కార్యక్రమం జరుగుతుండగా హీరో యశ్‌ను చూడటానికి అభిమానులు, విద్యార్థులు ఉత్సాహంతో వేదిక సమీపంలో అమర్చిన భారీ సౌండ్ బాక్స్ ప్రేమ్‌లు, ఫ్లడ్ లైట్ స్తంభాలపైకి ఎక్కారు. విద్యార్థుల బరువును తట్టుకోలేక అవి ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఈవెంట్లో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనగా, కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు సకాలంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే స్టార్ హీరో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారని తెలుసా తగినంత భద్రత కల్పించడంలో విఫమలమైంది. అలాగే అనుమతులకు మించి జనసమీకరణ, సరైన ప్రమాణాలు లేని నిర్మాణాలు ఏర్పాటు చేసినందుకే ఈ ప్రమాదం జరిగిందని భావించిన పోలీసులు మల్లారెడ్డి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే టాక్సిక్ చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!