Site icon NTV Telugu

Tovino Thomas : ఓనమ్ విన్నర్ టోవినో థామస్ ‘ARM’.. ఎన్ని కోట్లంటే..?

Untitled Design (45)

Untitled Design (45)

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.  “ARM” సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా విడుదలయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేసారు.

Also Read : Mohan Babu : తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై మోహన్ బాబు లేఖ..

ఓనమ్ కేరళలో ముఖ్యమైన పండుగ. టాలీవుడ్ లో సంక్రాంతి ఎలాగో మలివుడ్ లో ఓనమ్ కూడా సినిమాలకు మాంచి సీజన్. ఈ ఏడాది ఓనమ్ కానుకగా ARM, కిష్కింద కాండం, కొండల్, బ్యాడ్ బాయ్స్ వంటి నాలుగు  సినిమాలు రిలీజ్ అయ్యాయి.  వీటిలో ARM, కిష్కింద కాండం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. టోవినో థామస్ ARM  రిలీజ్ నాటి నుండి పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. కేరళ వ్యాప్తంగా ARM  8 రోజులకు గాను రూ. 28.6కోట్లు, వరల్డ్ వైడ్ గా 10 డేస్ కు రూ. 63 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి, ప్రీవియస్ తొవినో థామస్ చిత్రం తుళ్లుమల క్లోసింగ్ గ్రాస్ రూ. 47. 5 కోట్ల తో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. బుకింగ్స్ విషయంలోనూ ARM దూసుకెళ్లింది.  10 రోజులకు గాను 11,50,000 టికెట్స్ పైగా  బుక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసి ఓనమ్ విన్నర్ గా నిలిచింది. 

Exit mobile version