టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90స్, జెన్ జీ ఆడియన్స్‌కు తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్లదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్లతో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవడం, రెమ్యునరేషన్లలో హవా, నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ.. ఇలా హీరోయిన్ల మధ్య సైలెంట్ వార్ నడిచేది. ఆ తర్వాత సమంత- కాజల్, శృతి హాసన్- తమన్నా, రష్మిక- సాయి పల్లవిలను కాంపిటీటర్లుగా చూశారు. ఇప్పుడు వీరి జాబితాలోకే వస్తున్నారు నయా క్వీన్స్.
Also Read : OGConcert : నేడే ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవర్ స్టార్ స్పీచ్ పై ఉత్కంఠ
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ అంటే శ్రీలీల- భాగ్యశ్రీ బోర్సేలదే. శ్రీలీలకు ఝలక్ ఇచ్చే బ్యూటీ మీనమ్మే అవుతుంది అనుకుంటే రేసులోకి దూసుకొచ్చింది క్యూట్ గర్ల్ భాగ్య. ఈ ఇద్దరూ ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నా ఆఫర్లు వచ్చిన కొదవేమీ లేదు. అలాగే శాండిల్ వుడ్ నుండి ఊడిపడిన శ్రీనిధి శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రెజెంట్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. నీల్- తారక్ మూవీలో ఫీమేల్ లీడ్‌గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేసింది రుక్కు. ఇక శ్రీనిధి హిట్3లో హిట్ కొట్టేసింది. ప్రెజెంట్ తెలుసు కదాలో నటిస్తోంది ఈ చందనపు బొమ్మ. ఫ్యూచర్‌లో ఈ ఇద్దరి మధ్య టీటౌన్ వేదికగా వర్క్ పరంగా ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. ప్రేమలుతో ఓవర్ నైట్ క్రేజ్ బ్యూటీగా మారిన మమితా బైజుకు పోటీగా మారబోతున్నారు కయాద్ లోహార్ అండ్ ప్రీతి ముకుందన్. ప్రీతి ఆఫర్లలో కాస్త వెనకబడ్డ మమితాకు ఆఫర్లను కొల్లగొట్టడంతో కాంపిటీటర్ అవుతుంది కయాద్. మమితా చేతిలో విజయ్, సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో వర్క్ చేస్తుంటే తమిళ్, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా ఛాన్సులు దక్కించుకుంటోంది డ్రాగన్‌తో యూత్ గుండెల్ని గాయబ్ చేసిన కయాద్ లోహార్. ఇలా ప్రతి ఫేజ్‌లోనూ ఇద్దరు ముగ్గురు భామల మధ్య హెల్తీ కాంపిటీషన్ నెలకొంటోంది. మరీ ఇంత మంది యంగ్ ముద్దుగుమ్మలకు పోటీగా ఇంకెంత మంది బ్యూటీలు యాడ్ అవుతారో..? ఎవరు టాప్ చైర్‌లో నిలుస్తారో…? ఎవరు నెక్ట్స్ సౌత్ స్టార్ క్వీన్స్‌గా మారతారో చూద్దాం
