పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. భారీ బడ్జెట్ పై భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు అలా పెరుగుతూ వెళ్తున్నాయి.
Also Read : Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ ను స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా నేడు OG ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను నేడు హైదరాబాద్ లోని LB స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసార. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి పవర్ స్టార్ అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరుకాబోతున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి కూడా వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా రాబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకను కనివిని ఎరుగని రీతిలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ ఈవెంట్ లో స్పెషల్ ప్రోగ్రాం ఉండబోతుందట. సాయంత్రం 5గంటల నుండి మొదలు కాబోతున్న ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదేమైన OG క్రేజ్ చూస్తుంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి నంబర్ వచ్చేలా ఉంది.