Site icon NTV Telugu

Tollywood : పవర్ ఫుల్ పోలీస్ గా యంగ్ హీరో.. దర్శకుడు ఎవరంటే..?

Untitled Design (78)

Untitled Design (78)

ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

Aalso Read: Tillu: సిద్దూ జొన్నలగడ్డది ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..

ఇదిలా ఉండగా ఈ రోజు విశ్వక్ సేన్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నూతన దర్శకుడు శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఖాకి డ్రెస్ ధరించి గన్ ను చూపిస్తూ, ముఖం కనిపించకుండా వెనక నుండి విశ్వక్ ను పోస్టర్ డిజైన్ చేశారు. ప్రతి చర్యకు నిప్పులాంటి ప్రతిచర్య ఉంటుందని పోస్టర్ లో పేర్కొన్నారు. చూస్తుంటే ఇదేదో పవర్ ఫుల్ పోలీస్ కథా నేపథ్యం ఉన్న సినిమాగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా విశ్వక్ కెరీర్ లో 13వ సినిమాగా రానుంది.SLV బ్యానర్ లో 8వ సినిమాగా రానున్న ఈ ఈ సినిమాకు అజనీష్ లోకానాధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘లైలా’ సినిమాలోనూ నటిస్తున్నాడు విశ్వక్ సేన్.

Exit mobile version