Site icon NTV Telugu

Tollywood : తండ్రి కూతుళ్ళకు కలిసి రాని టాలీవుడ్.. కూతురి కోసం రంగంలోకి స్టార్ డైరెక్టర్

Shankar

Shankar

విజనరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డీగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్2, గేమ్ ఛేంజర్స్ రిజల్ట్. ఏళ్ల పాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్‌గా మారడమే కాదు శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్‌పై డౌట్స్ పడేలా చేశాయి. ఇండియన్2 దెబ్బకు రణవీర్‌తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళితే భారతీయుడు2 వంటి ప్లాప్ మూవీకి సీక్వెల్ చేసుకుంటున్నాడు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యుయేష్ ఇలా ఉంటే నిన్నకాక మొన్న వచ్చిన అదితి పరిస్థితి మరోలా ఉంది.

Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ కు సెలెబ్రెటీల విషెస్… ఎవరెవరు ఏమన్నారంటే

టాలీవుడ్ ఎంట్రీ తండ్రికే కాదూ కూతురు అదితికి కలిసిరాలేదు. అలా అని తమిళంలో ఏదో మ్యాజిక్ చేసేసిందని కాదు. అంతా డొల్లే. టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేసింది అదితి. కోలీవుడ్‌లో నేసిప్పాయా, తెలుగులో భైరవంతో ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది ఆదితి. కానీ ఆమెను ఫెయిల్ చేసేశారు కోలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్. ఇక అర్జున్ దాస్‌తో నటించిన వన్స్ మోర్ షూటింగ్ కంప్లీటైనా విడుదలకు నోచుకోవడం లేదు. వాలంటైన్స్ వీక్ టైంలోనే రిలీజ్ చేయాలనుకుంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.  తన కెరీర్లో ఓ ఎచీవ్ మెంట్ చూసిన శంకర్  ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా అడుగులేస్తున్న తన బుజ్జాయి ఫెయిల్యూర్స్ చూడలేక స్టార్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు తండ్రి. వరుస ప్లాపులతో స్ట్రగుల్ చేస్తున్న ఆదితిని తిరిగి నిలబెట్టేందుకు తన దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ దర్శకుడ్ని లైన్లో పెట్టాడట. వైశాలి ఫేం అరివళగన్ దర్వకత్వంలో ఓ ఫీమేల్ సెంట్రిక్ చేయబోతుందట అదితి. అఫీషియల్ స్టేట్ మెంట్ తర్వలో రానుందట. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితేనే కానీ తెలియదు అదితి ఖాతాలో సినిమా ఉందా లేదా అని.. అప్పటి వరకు వెయిట్..

Exit mobile version