Site icon NTV Telugu

Tollywood: సినిమానా మజాకా.. అప్లికేషన్ దెబ్బకి సైట్ క్రాష్

Guild

Guild

సినీ పరిశ్రమలో ఫిల్మ్ ఫెడరేషన్ తరపున యూనియన్ సభ్యులందరూ కలిసి 30% వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2022లో చివరిగా వేతనాలు పెంచారు. ఆ తర్వాత మూడేళ్ల తరువాత ఈ వేతనాల పెంపు ఉండేలా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ నష్టాలలో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు మాత్రం ఆ పెంపుకు సుముఖంగా లేరు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కేవలం పెంచిన వారి షూటింగ్స్‌కి మాత్రమే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

Also Read : Chiranjeevi: చిరంజీవితో నిర్మాతల భేటీ?

దీంతో నిర్మాతలు అందరూ కలిసి అసలు యూనియన్‌లతో సంబంధం లేకుండా ఎవరితో అయినా షూటింగ్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. అందులో కొన్ని విభాగాలకు సంబంధించి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే చాలామంది ఔత్సాహికులు ఈ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సైట్ క్రాష్ అయింది. అయితే మెయిల్ ఐడీ మాత్రం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Exit mobile version