NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..

Untitled Design (93)

Untitled Design (93)

హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో మరు మోగింది. ఆ సినిమా విజయంతో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం హనుమాన్ కు సిక్వెల్ ‘జై హనుమాన్’ ను నిర్మిచనున్నాడు నిరంజన్. మరోవైపు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని పట్టాలెక్కించంబోతున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి, ఈ సినిమా షూటింగ్ ను బెంగళూరులో ప్రారంభించబోతున్నారు.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9 న సూపర్ స్టార్ సూపర్ హిట్ సినిమాలు ఒక్కడు, మురారి 4K లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది బుక్ మై షో. ఇంకా రిలీజ్ కు రెండు రోజులు ఉన్న ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ విషయంలో గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. రీరిలీజ్ సినిమాలలో అడ్వాన్సు బుకింగ్స్ లో అత్యంత ఫాస్ట్ గా రూ. 2 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మురారి సంచలనం సృష్టించింది.

Also Read: Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీయార్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ -2. హృతిక్ రోషన్, తారక్ కాంబోలో రానున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ లో నిర్మించనుంది. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఆగస్టు 17న స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో తారక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మరోవైపు తారక్, ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టు 9న పూజ కార్యక్రమం తో స్టార్ట్ కానుంది

Show comments