Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…

Untitled Design (11)

Untitled Design (11)

నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేసారు ఆయ్ మేకర్స్.

Also Read : TamilNadu BSP : స్టార్ దర్శకుడి మెడకు చుట్టుకున్న కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ హత్య..?

రాజావారు రాణీవారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌. ఆ సినిమా ప్రయాణంలో ఈ జంట ప్రేమకు బీజం పడింది. అలా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా ఈ ప్రేమ జంట ఈ నెల 22 న ఓ శుభముహూర్తాన వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. కిరణ్, రహస్యాల వివాహం కూర్గ్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో అతికొద్దీ మంది సమక్షంలో జరగనుంది.

Also Read: Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
నాచురల్ స్టార్ నాని హీరోగా రానున్న చిత్రం సరిపోదా శనివారం. గతంలో నానీతో అంటే సుందరానికి వంటి యావరేజ్ సినిమాను తెరెకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరోసారి జాతకాట్టాడు నాని. అన్ని హంగులు ముగించుకుని ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. ఇందులో భాగంగా సరిపోదా శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ ఆగస్టు 24న నిర్వహిస్తున్నట్టు తెలుపాడు నాని.

Exit mobile version