NTV Telugu Site icon

Tollywood: చిన్న సినిమా.. రీసౌండ్ వచ్చేలా కలెక్షన్స్.. ఏమిటా సినిమా..?

Untitled Design 2024 08 11t134614.431

Untitled Design 2024 08 11t134614.431

నీహరిక కొణిదెల నిర్మాతగా వ్యవహరంచిన లేటేస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు. అందరూ నూతన నటీనటులతో తెరకెక్కింది ఈ సినిమా. గురువారం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ప్రిమియర్స్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన కమీటీ కురోళ్ళు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. A,B సెంటర్లలో మంచి ఆక్యూపెన్సీ కనిపించింది. మౌత్ టాక్ బాగుండడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి..

Also Read: Mohan Babu: శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, MBU స్నాతకోత్సవ వేడుకలు

నిహారిక కొణిదెల అని తానై ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారీ ప్రమోషన్స్ చేపట్టింది. పల్లెటూరు, స్నేహం, జాతర, ఎలక్షన్ గొడవలు అన్నీ కలగలిపి మంచి కథ , కొత్త పాత్రలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల మనుషులను, కాసిన్ని జ్ఞాపకాలను పోగేసి నష్టాలజీ మూమెంట్స్ ను స్క్రీన్ పై చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మొదటి రోజు హిట్ రావడంతో రెండవ రోజు నుండి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని థియేటర్లు యాడ్ చేసారు. రిలిజ్ అయిన రెండు రోజులకు గాను కమిటీ కుర్రోళ్ళు వరల్డ్ వైడ్ గా 3.69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ సంతోషాన్నిసెలెబ్రేట్ చేసుకుంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. శుక్ర,శని వారాలలో మల్టీప్లెక్స్ లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఆదివారం వీకెండ్ మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మొదటి సినిమాతోనే సువర్ హిట్ కొట్టిన యదు వంశీ పై టాలీవుడ్ కి మరో విషయం ఉన్న దర్శకుడు దొరికినట్టేనని చర్చించుకుంటున్నాయి సినీ వర్గాలు.

Show comments