తెలుగు సినిమా ప్రేక్షకులకు అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాల కోసం నిర్మాతలు, హీరోలు పోటీ పడటం సర్వసాధారణం. అయితే, వచ్చే సంక్రాంతికి ఏకంగా ఏడు సినిమాలు తమ పండుగ రేసులో ఉన్నట్లు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్ని సినిమాలు థియేటర్లలో ఒకేసారి దిగడం అసాధ్యం, అందుకే ఈ రేసు నుంచి కచ్చితంగా ఇద్దరు హీరోలు తప్పుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read :IBomma Ravi: ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు… ఖండించిన నిర్మాత బన్నీ వాసు!
ప్రస్తుతం సంక్రాంతి బరిలో కర్చీఫ్ వేసినట్లు ప్రకటించిన ఏడు సినిమాలు ఇవే:
మెగాస్టార్ చిరంజీవి – ‘మన శంకరవరప్రసాద్‌గారు’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ‘రాజాసాబ్’
మాస్ మహారాజా రవితేజ – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’
యంగ్ హీరో శర్వానంద్ – ‘నారీనారీ నడుమ మురారి’
తమిళ స్టార్ విజయ్ – ‘జన నాయగన్’
తమిళ స్టార్ శివ కార్తికేయన్ – ‘పరాశక్తి’
Also Read :సాహితి దాసరి రెడ్ సారీ స్పెషల్: మత్తెక్కించే గ్లామర్ షో
ఇంత భారీ పోటీలో చిరంజీవి సినిమా రావడం మాత్రం గ్యారెంటీ అని పరిశ్రమ వర్గాలు నమ్ముతున్నాయి. మిగిలిన ఆరు చిత్రాల్లో ప్రధానంగా ఇద్దరు చిన్న హీరోలు, ఇద్దరు తమిళ హీరోలు వెనక్కి తగ్గక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఏడు సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, కొంతమంది యంగ్ హీరోలు ధైర్యంగా ‘సంక్రాంతికే వస్తాం’ అని బిల్డప్ ఇవ్వడానికి కారణం ఒక పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అవుతుందనే ప్రచారం. సినీ వర్గాల్లో ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా వాయిదా పడుతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ పెద్ద సినిమా రేసు నుంచి తప్పుకుంటే, థియేటర్ల సమస్య కొంతవరకు తగ్గుతుందని, అందుకే యంగ్ హీరోలు పండుగకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఈ ప్రచారానికి బలం లేకుండా… ‘రాజాసాబ్’ చిత్రయూనిట్ తమ రిలీజ్ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 23న విడుదల కానుంది. ఈ పోస్టర్‌పై మరోసారి సినిమా విడుదల తేదీని జనవరి 9 గా ప్రకటిస్తున్నారు. దీంతో, ‘రాజాసాబ్’ వాయిదా ప్రచారానికి చెక్ పడినట్లు అయ్యింది. తెలుగు స్టార్ హీరోల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో, తమిళ స్టార్ హీరోల చిత్రాలైన విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలను తెలుగు డిస్ట్రిబ్యూటర్లు లైట్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలకు ఒకటి, అర థియేటర్లతో సరిపెట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే, యంగ్ హీరోలు అయిన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మరియు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రేసు నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, డిసెంబర్ మొదటి వారం నాటికి ఏ సినిమాలు సంక్రాంతి రేసులో ఉంటాయో, ఏవి తప్పుకుంటాయో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.