C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
C.Kalyan: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ పరిధిలో స్థల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో సియాట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు ఉదయం నిర్మాత సి. కళ్యాణ్ తన అనుచరులతో కలిసి సదరు స్థలాల్లోకి అక్రమంగా చొరబడ్డారని సియాట్ సొసైటీ ప్రెసిడెంట్ శ్యామ్ సింగ్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా, స్థలాల చుట్టూ బ్లూ షీట్లను అడ్డుగా ఏర్పాటు చేసి అసలైన ప్లాట్ యజమానులు లోపలికి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
గతంలోనూ కొందరు వ్యక్తులు ఈ భూములపై కన్నేసి ఆక్రమణలకు తెగబడగా వారిపై ఫిర్యాదులు చేశామని సొసైటీ ప్రతినిధులు గుర్తుచేశారు. తాజాగా మళ్లీ భూకబ్జా యత్నాలు ముమ్మరం కావడంతో సి. కళ్యాణ్‌తో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్లాట్ ఓనర్లు మాదాపూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా పేరున్న సి. కళ్యాణ్ పేరు ఈ స్థల వివాదంలోకి రావడంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన మాదాపూర్ పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు