తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. అదేమంటే టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ అయ్యాడు.. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ అనంతరం ఆ ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసిన శివరామకృష్ణ బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్‌లో పాగా వేశాడు. అయితే 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో అప్పటి ప్రభుత్వం కేసు వేసింది..అప్పటి నుంచి మొదలైన న్యాయపోరాటంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వం గట్టిగానే కష్టపయింది.
Ram Charan: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణే.. అరుదైన గౌరవం
ఇక చివరిగా శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు, కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను అరెస్ట్ చేశారు. నిజానికి కొద్దిరోజుల క్రితమే ఓయూ పోలీస్ స్టేషన్ లో బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో నిర్మాత శివరామకృష్ణను ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే నన్నే పోలీస్ స్టేషన్కు పిలిపిస్తావా అంటూ ఇన్స్పెక్టర్ మీద నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ దాడి చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతతో పాటు అతనితోపాటు వచ్చిన అనుచరులు సైతం ఇన్స్పెక్టర్ సహా మిగతా పోలీసుల మీద దాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక నిర్మాతగా బూరుగుపల్లి శివరామకృష్ణ అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. రవితేజతో దరువు సినిమా సహా యువత, రైడ్ ఏమో గుర్రం ఎగరావచ్చు వంటి సినిమాలను ఆయన నిర్మించారు. సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన అందరి బంధువయ, మహేష్ బాబుతో యువరాజు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.