ఇటీవల కాలంలో తెలుగు భాషను తెలుగు ప్రేక్షకులను, తెలుగు భాషను అగౌరవిస్తున్నారు తమిళ చిత్ర నిర్మాతలు. ఇతర భాషలు హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పుడు కనీసం పేరు కూడా మార్చకుండా ఇతర భాష టైటిల్ ను తెలుగులో వాడేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి విధానం కాదు. ఈ పద్ధతి ఓక రకంగా తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నట్టే లెక్క. ఒకప్పుడు “డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో, ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. కానీ ఏ మధ్య కాలంలో కనీసం ఆ చిన్న పని కూడా మానేసి విడుదల చేస్తున్నారు.
రజనీ కాంత్ ‘ వేట్టయన్’ టైటిల్ ను కనీసం తెలుగులో మార్చండి అని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు కొందరు పంపిణి దారులు. అదొక్కటే కాదు తునీవు, వలిమై, తంగలాన్, కంగువా అసలు వీటి అర్ధం ఏమిటో సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండా ప్రేక్షకుడు చూడాలి అని మనపై రుద్దుతున్నారు. వారి వారి భాష లలో వారి భాష గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవించుకోవాలి, అలాగే తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం కాదు. డబ్బింగ్ సినిమా రైట్స్ కొనుగోలు దారులు కూడా చూస్తున్నాం కదా అని ఈ మద్య ఎలా పడితే అలా చేస్తున్నారు. ఎలా ఉన్నా చూస్తారు లే అన్నట్టు చేస్తున్నారు. మనం పర భాష సినిమాలు ఆదర్శిస్తున్నాం అంటే అది మన సంస్కారం . అలాగని పేరు కూడా మార్చకపోవడం, సబబు కాదు.