Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. మే 13, 2026 తేదీతో కూడిన తన రాజీనామా లేఖను కౌన్సిల్ అధ్యక్షుడు, సెక్రటరీ సహా ఇతర కార్యవర్గ సభ్యులకు ఆయన పంపించారు. కౌన్సిల్ ప్రస్తుత పనితీరుపై తీవ్ర నిరాశతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నట్టి కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. పర్సంటేజీ వ్యవస్థను సరిగ్గా నిర్వహించడంలో మండలి విఫలమైందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆఫీస్ బేరర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ గిల్డ్ కార్యకలాపాలు నడుపుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల ఎగ్జిబిటర్ల ఆధిపత్యం పెరిగిపోతోందని, ఫలితంగా చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతూ పతనమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కౌన్సిల్లో కనీస ప్రజాస్వామ్య విధానాలు అమలు కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆఫీస్ బేరర్ల ప్రమేయం లేకుండా, సరైన సమాచారం ఇవ్వకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారని, సరైన ఎన్నికల ప్రక్రియ లేకుండానే సంస్థను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆడిటింగ్, సహా ఆర్థిక నిర్వహణలో ఎలాంటి పారదర్శకత, జవాబుదారీతనం లేదని ఆయన తన లేఖలో కుండబద్దలు కొట్టారు. సభ్యులకు పారదర్శకంగా సేవ చేయలేని, ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన తేల్చి చెప్పారు. తన రాజీనామా తర్వాత అయినా సంస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు తన లేఖ ద్వారా కౌన్సిల్‌కు పలు సూచనలు చేశారు. తన రాజీనామా తర్వాత అయినా ఆఫీస్ బేరర్లంతా చురుకుగా వ్యవహరించి, నిర్మాతలందరి సంక్షేమం కోసం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో సంస్థను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి వీలుగా వెంటనే సరైన ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన అకౌంటెంట్లు, ఆడిటర్లను నియమించి, అకౌంట్స్ నిర్వహణను పారదర్శకంగా ఉంచాలని కోరారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన రాజీనామాను ఆమోదించాలని కౌన్సిల్‌ను అభ్యర్థించారు.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!