NTV Telugu Site icon

Tollywood : నాగ చైతన్య బాటలో మరో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?

Untitled Design 2024 08 08t121521.122

Untitled Design 2024 08 08t121521.122

శ్రావణమాసం సందర్భాంగా ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హాడావిడీ కమిపిస్తోంది. మరోవైపు పలువురు సెలెబ్రిటీలు కూడా బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి వైవాహిక జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. నేడు టాలీవుడ్ కు చెందిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక ఇదే దారిలో మరొక హీరోయిన్ ఉన్నట్టు తెలిపింది. సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఆసక్తికర విషయాలు తెలిపారు .వచ్చే ఏడాది ప్రియా భవాని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారని చెప్పి తన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. టాలీవుడ్ లో హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత సిరీస్‌లో తన నటనతో మెప్పించి హీరోయిన్ ప్రియా భవాని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

Also Read : Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

చెన్నైకు చెందిన ప్రియా భవానీశంకర్‌.. ‘మేయాద మాన్’తో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత తెలుగులో గోపీచంద్ తో భీమా, విశాల్‌తో రత్నం సినిమాల్లో అలరించింది ప్రియా భవాని శంకర్. తాజాగా వచ్చిన భారతీయడు 2లో కూడా కీలక పాత్ర చేసింది. ఇటీవల ఆమె పెళ్లిపై పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘రాజవేల్ అనే వ్యక్తితో సినిమాలోకి రాకముందే రిలేషన్ లో ఉన్నా. మేమిద్దరం చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. సరైన సమయం దొరకడం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా వివాహం చేసుకుంటాము అంటూ ప్రియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియా ‘డెమోంటే కాలనీ 2’ కోసం వర్క్‌ చేస్తున్నారు. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆమె పెళ్లి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

Show comments