NTV Telugu Site icon

Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?

Untitled Design (4)

Untitled Design (4)

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. 60 ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ పక్కన స్టెప్పులు వేస్తున్నారంటే స్టార్ హీరోల ఫ్యాన్ బేస్ ఏపాటిడో అర్ధం చేసుకోవచ్చు. కానీ హీరోయిన్స్ పరిస్థితి ఆలా కాదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. దాంతో వారికి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను కెరీర్ స్టార్టింగ్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.

ఇటీవల కాలంలో తెలుగులో లేడీ సూపర్ స్టార్ పొజిషన్ ఖాళీగా ఉంది. అనుష్క తర్వాత కాజల్, సమంత కొన్నాళ్ళు ఆ ప్లేస్ భర్తీ చేసినా ప్రస్తుతం వాళ్లు సినిమాలు అరకొర మాత్రంగానే చేస్తున్నారు. కాగా అక్కినేని సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మీనాక్షి చౌదరి. చూస్తుంటే ఈ భామ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కిరీటాన్ని అందుకునేలా ఉంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం 6 సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. వీటిలో తమిళ స్టార్ హీరో విజయ్ G.O.A.T, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, మెగాస్టార్ ‘విశ్వంభర’, విశ్వక్ మెకానిక్ రాకి, వరుణ్ తేజ్ ‘మట్కా’, వెంకీ అనిల్ రావిపూడి సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే మీనాక్షి చౌదరి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. వీటితో పాటు మరో 2 చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

 

Also Read: Release clash : మరోసారి మెగా vs అల్లు..ఈ సారి గెలుపెవరిది..?

Show comments