Site icon NTV Telugu

Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..

Keerthy Suresh

Keerthy Suresh

పద్ధతిగా ఉంటే అలాంటి రోల్సే వస్తాయనుకుందేమో గ్లామర్ షోకు డోర్స్ తెరిచింది కేరళ కుట్టి కీర్తి సురేష్. మహానటితో టాలీవుడ్ ఆడియన్స్ తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఆ మూవీ ఇచ్చిన నేమ్ ఫేమ్‌ను కాపాడుకుంటూ బౌండరీస్ క్రాస్ చేయకుండా పద్ధతిగా కనిపించింది అమ్మడు. ఓవైపు ఉమెన్ కంట్రీస్.. మరో వైపు స్టార్ హీరోస్‌తో జోడి కట్టింది. కానీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. రీజనల్ లాంగ్వేజ్‌తో ఎంతకాలం  బండి నడిపిస్తాం, నిన్నగాక మొన్న వచ్చిన రష్మిక లాంటి హీరోయిన్లు బీటౌన్ వైపు చూస్తుంటే..  తానేం తక్కువ తినలేదు అనుకుందేమో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది కీర్తి.

Also Read : AkhilAkkineni Engagement : గ్రాండ్ గా అక్కినేని అఖిల్ – ‘జైనబ్ రావ్‌జీ’ నిశ్చితార్ధం

వరుణ్ ధావన్‌ హీరోగా వస్తున్న బేబీ జాన్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టింది.  బాలీవుడ్ పట్టించుకోదేమోనని భయపడింది ఏమో తొలి సినిమాతోనే   వయ్యారాలు వలక బోసింది. తేరి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ నుండి ఓ పాట రిలీజైంది. ఆ సాంగ్‌లో ఎన్నడూ చూడని కీర్తి కనిపిస్తోంది. ఫస్ట్ టైం సెడెక్టివ్ వర్షన్‌లో పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసి ‘అందం చూడవయా ఆనందించవయా’ అనే రేంజ్ లో సెగలు పుట్టించింది అమ్మడు. టాలీవుడ్ లో గ్లామర్ షో అంటే నై..నై.. అని చెప్పే ఈ భామలు బాలీవుడ్ అడిగిందే ఆలస్యం అన్నట్టుగా సై.. సై అనడం చూసి ఇందేదయ్యా ఇది మేము చూడలా అంటూ కీర్తిపై  సెటైర్ వేస్తున్నారు సౌత్ ఆడియెన్స్. మొత్తానికి బాలీవుడ్  నీళ్లు బాగానే  వంటపట్టాయని అనుకుంటున్నారు.  మొత్తానికి బాలీవుడ్ నీళ్లు కీర్తికి బాగానే వట్టబట్టాయి. వచ్చే నెలలో ప్రియుడితో ఏడడుగులు వేయబోతుంది కీర్తి సురేష్.

Exit mobile version