Kannappa: హరిహర వీరమల్లుపై వివాదం చేసిన వాళ్ళు కన్నప్పపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి టాలీవుడ్ ను ప్రశ్నించారు. మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు, బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేస్తూ అవమానిస్తూ చిత్రాల నిర్మిస్తుంటే సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ సినిమాలపై కోర్టులు మొట్టికాయలు వేసిన సరే చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ సిగ్గు వస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు.
Also Read: Telangana Film Chamber : పవన్ ‘హరిహర వీరమల్లు’ కోసం థియేటర్లను ఖాళీగా ఉంచాం!
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
గత వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు సినిమాపై సినీ ఇండస్ట్రీలో కొన్ని వర్గాల పెద్దలు వివాదం చేశారని, అదే పెద్దలు కన్నప్ప సినిమాపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ను అవమానించాలని సినీ రంగ పెద్దలు వివాదం చేశారా అని శ్రీధర్ ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చులకన,హేళన భావంతో ఉన్నట్లుగా భావిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
Also Read: Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు పెట్టి సనాతన సాంప్రదాయాన్ని అవమానించుతున్నారని, పిలక అంటే శిఖ పేరుతో పురాణ ఇతిహాసాలు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దేవతలకు కూడా శిఖ ఉంటుందని దాన్ని ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు ధరిస్తున్నారని అన్నారు. దాన్ని సినిమాలో హాస్య పాత్రల కోసం వాడుకోవడం క్షమించరానిదని, ఈ పాత్రలపై గత నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాము రిట్ పిటిషన్ 6236/2025 గా దాఖలు చేశామని అన్నారు. అందులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వారిని, కేంద్ర చలనచిత్ర పరిశ్రమ శాఖను, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, సప్తగిరిని ప్రతివాదులుగా చేర్చటం జరిగిందని, దీనిపై హైకోర్టులో కౌంటర్ పడేయకుండా మోహన్ బాబు కుటుంబం సినీ ప్రొడక్షన్ యూనిట్ నాటకాలు ఆడుతున్నారని, కేంద్ర సినీ శాఖ అధికారులు మాత్రం తమ వాదన వినిపిస్తున్నారని, సెన్సార్ బోర్డు రీజనల్ అధికారి ఈ సినిమా పై చర్యలు తీసుకోకపోతే భారతీయ చలనచిత్ర చట్టం ప్రకారం ఆ అధికారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగా కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చేస్తారని శ్రీధర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!