NTV Telugu Site icon

Tollywood: ఒకే ఫ్రేములో టాలీవుడ్ స్టార్ హీరోలు

Tfi Heros

Tfi Heros

న‌చ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాట‌ల్లో చెప్పలేం. అదే న‌చ్చిన హీరోలు అందరూ త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌లిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండ‌గే. అలాంటి పండ‌గ లాంటి స‌ర్ ప్రైజ్ ని అభిమానుల‌కు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నంద‌మూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ద‌గ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వ‌చ్చిన హీరోలు గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఏలుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sunil Shetty: షూటింగ్ లో నటుడికి తీవ్ర గాయాలు

ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోలుంటే అక్కినేని, నంద‌మూరి, మెగా ఫ్యామిలీస్ నుంచి ఆ సంఖ్య‌ భారీగానే వుంది. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి కేవ‌లం ముగ్గురంటే ముగ్గురు హీరోలు బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ మాత్ర‌మే లైమ్ లైట్ లో స్టార్ లుగా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే దాదాపు 10 మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచే వుండ‌టం విశేషం. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో ఉన్నారు. అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్‌, సుశాంత్. వీళ్ల‌ల్లో నాగార్జున‌, నాగ‌చైత‌న్య హీరోలుగా త‌మ స‌త్తాని చాటుతున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్ ఒకే ఫ్రేమ్ లో ఉండడం గమనార్హం. వీరంతా ఎందుకు కలిశారో, ఎక్కడ కలిశారో క్లారిటీ లేదు కానీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments