సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేది భాష, యాస. ఎంత రీజనల్ లాంగ్వేజ్‌లో హీరో కనిపిస్తే అంత కనెక్ట్ అయిపోతుంటారు ఆడియన్స్. వారి యాసలో మాట్లాడితే.. మనోడురా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పుష్పతో రాయలసీమ ఆడియన్స్‌కు బన్నీ దగ్గరైతే.. దసరాతో నాని తెలంగాణ ప్రేక్షకుల మనసు దోచాడు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త యాసను ఎక్స్ పీరియన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నారు త్రీ హీరోస్. ఉత్తరాంధ్ర భాషపై మక్కువ పెంచుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం పరిసర ప్రాంతాల యాస కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ రీజనల్ లాంగ్వేజ్‌తో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్నాయి కోటబొమ్మాళి, పలాస. ఇప్పుడు ఆ యాసలోని రుచిని మరింత చేరువ చేసేందుకు సిద్ధం అవుతున్నారు చైతూ, చెర్రీలు.
UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
ఈ పాలి యాట.. గురి తప్పేదే లెస్ అంటూ అసలు సిసలైన సిక్కోలు జాలరిగా కనిపించబోతున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళంలో జరిగిన మత్య్సకారుల రియల్ స్టోరీ ఇన్సిడెంట్ ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది. ఇందులో చైతూ ఇంటెన్సివ్ లుక్స్‌లో రఫ్పాడిస్తున్నారు. ఆ భాషను నేర్చుకుని… తన డైలాగులతో పలికిస్తున్న యాసతో పులకరించిపోతుంది ఉత్తరాంధ్ర. చైతూ డిఫరెంట్ లుక్స్, లాంగ్వేజ్‌తో మెస్మరైజ్ చేస్తుండటంతో తండేల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే యాసను నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ నుండి షిఫ్టైన రామ్ చరణ్.. బుచ్చిబాబుతో వర్క్ స్టార్ట్ చేశాడు. ఇది కూడా శ్రీకాకుళం స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతున్న మూవీగా గట్టిగా బజ్ నడుస్తోంది. మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చెర్రీనే కాదు.. వెన్నెల కిషోర్ కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటూ వస్తున్నాడు. క్రైమ్ కామెడీతో పాటు.. సిక్కులు ప్రజల జీవితాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు దర్శకుడు మోహన్. డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకులను పలకరించబోతుంది. మరీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.