NTV Telugu Site icon

Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?

Untitled Design (66)

Untitled Design (66)

శుక్రవారం అంటేనే కొత్త సినిమాల రిలీజ్ లతో టాలివుడ్ బాక్సాఫీస్ సందడి సందడిగా ఉంటుంది. ఆ విధంగానే ఎన్నో అంచనాలు ఆశలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేసాయి. గురు, శుక్రు వారాలలో రిలీజైన సినిమాలు వీకెండ్ రన్ ముగిసింది. నేడు సినిమాలకు అసలైన పరీక్ష ఉంటుంది. ఈ సినిమాల ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Also Read : Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ రిలీజ్ ఎప్పుడంటే..?

ముందుగా ఆగస్టు 1న విడుదలైన ‘శివం భజే’ మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్న దర్శకత్వ వైఫల్యంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆగస్టు 2న ఏకంగా 5 సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులపై దండెత్తాయి. వరుణ్ సందేశ్ ‘విరాజి’. ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళింది. రిలీజైన సంగతి ఎక్కువ మందికి తెలియదు అంటే తప్పు వరుణ్ మాత్రం కాదు. ఈ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అదే రోజు వచ్చిన మరో సినిమా ‘ఉషాపరిణయం’. గతంలో సీనియర్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఆయన తనయుడు నటించిన ఈ సినిమా రొటిన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ రేస్ లో చతికిల పడింది. మరో సినిమా ‘అలనాటి రామచంద్రుడు’. అంతా కొత్తవారితో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇటీవల లావణ్య కేసుతో పాపులర్ అయిన రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల ‘తిరగబడరా సామి’ని తొంగి చూసే వారే లేరు. ఇక ఉన్నంతలో ఓ మోస్తరు బజ్ తో వచ్చిన చిత్రం ‘బడ్డీ’. అల్లు శిరీష్ నటించిన ఈ చిత్రం తమిళంలో వచ్చిన ‘టెడ్డి’ ని పోలి ఉండడంతో ఆడియన్స్ తిప్పి కొట్టారు. ఇలా ఆగస్టు 1 వీక్ సినిమాలు మొత్తం సూపర్ ఫ్లాప్స్ గా నిలిచేందుకు పోటీ పడ్డాయి.

Show comments