NTV Telugu Site icon

Tollywood : ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.. ఇదే నిదర్శనం

Untitled Design (8)

Untitled Design (8)

టాలివుడ్ లో ప్రస్తుతం చిన్నసినిమాల హావా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, దర్శకులు, భారీ బడ్జెట్ లు లేకున్న కూడా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కమర్షియల్ హంగులు కంటే కంటెంట్ ఉంటే టాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాలు నిరూపించాయి. రొటీన్ రొట్ట సినిమాలు తీసే దర్శకులకు చిన్నపాటి అలర్ట్ ఇచ్చారు పేక్షకులు. చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్లు కొట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం..

Also Read : Devara : ఆయుధపూజ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ముందుగా ఆగస్టు 9న రిలీజ్ అయిన సినిమా కమిటీ కుర్రోళ్ళు, అందరు కొత్తవాళ్లతో నూతన దర్శకుడు యదువంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చి దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి హిట్టు కొట్టిన చిన్న సినిమా ఆయ్. నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ. 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సెప్టెంబరులో రిలీజ్ అయిన 35 చక్కటి కుటుంబ కథా చిత్రంగా వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు నందకుమార్ ఈమని అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పక తప్పదు. ఈ నెలలో వచ్చిన మరో చిన్న సినిమా మత్తు వదలరా -2. శ్రీసింహ, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆడియన్స్ అభిరుచి మారుతుందని ఈ సినిమాల హిట్స్ మరోసారి నిరూపించాయి.

Show comments