Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కార్యవర్గంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మెజార్టీ డ్యాన్సర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించి, యూనియన్ను ముందుకు నడిపించే సత్తా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుమలత, ఆమె కార్యవర్గ తీరును వ్యతిరేకిస్తూ డ్యాన్సర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఇందులో భాగంగా సుమలత ప్యానెల్‌కు ఇప్పటికే అధికారికంగా సహాయ నిరాకరణ ప్రారంభించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పాత కార్యవర్గం వ్యవహార శైలిపై అసహనంతో ఉన్న సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రఘు మాస్టర్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్న డ్యాన్సర్లు, ఫిల్మ్ ఫెడరేషన్ తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. రఘు మాస్టర్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గానికే అధికారికంగా మద్దతు ఇవ్వాలని ఫెడరేషన్‌ను మెజార్టీ సభ్యులు నేరుగా కోరనున్నారు. దాదాపు యూనియన్ మొత్తం ఒకే మాటపై నిలబడి తిరుగుబాటు చేయడంతో, అసోసియేషన్ పగ్గాలు రఘు మాస్టర్ చేతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు