NTV Telugu Site icon

Mallu Beauties: మలయాళ భామల ప్రేమలో పడ్డ టాలీవుడ్

Nimisha Sajayan Anaswara Ra

Nimisha Sajayan Anaswara Ra

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే.. మాలీవుడ్‌పై టాలీవుడ్‌కు కూసింత ప్రేమ ఎక్కువ. అందుకే అక్కడ ముద్దుగుమ్మలకు ఇక్కడ పెద్ద పీట వేస్తుంది. ఎంతో మంది కేరళ కుట్టీలు తమ స్టన్నింగ్ లుక్స్, హెయిర్ స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు… చేస్తున్నారు. అయితే టీటౌన్‌లో నటించకుండానే.. క్రష్ బ్యూటీలుగా మారిపోయారు కొందరు. విజయ్, సూర్య లాంటి స్టార్ట్స్ తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ చేయకపోయినా.. ఇక్కడ వీరికున్న క్రేజ్… ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడేలా చేసింది. అలాగే తెలుగులో యాక్ట్ చేయకపోయినా.. కొంత మంది మాలీవుడ్ భామలకు ఐడెంటిటీ క్రియేట్ అయ్యింది. ఓటీటీ పుణ్యమాని.. ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా మారిపోతున్నారు. వారిలో పస్ట్ వరుసలో ఉంటుంది అనేశ్వర రాజన్. సూపర్ శరణ్యతో పాటు మైక్, నేరు, గురువాయిర్ అంబల నడయిల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తెలుగు కుర్రాళ్ల మనస్సులు దోచేసింది.

Iron Rich Fruits: ఈ పండ్లలో ఐరన్ స‌మృద్ధిగా లభిస్తుంది.. తప్పక తినండి!

నిమిషా సజయన్ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీతో అత్తారింట్లో కష్టాలు పడే అమ్మాయిగా మెప్పించింది నిమిషా. నాయట్టు, మాలిక్, చిన్నా, జిగర్తాండ డబుల్ ఎక్స్, పోచర్ వెబ్ సిరీసెస్ చాలు ఆమె నటనకు ఫిదా కావడానికి. మార్వెలెస్ యాక్టింగ్‌తో స్క్రీన్‌పై వన్ ఉమెన్ షోలా కనిపిస్తుంది. ఈ అమ్మాయి నటిస్తుందంటే.. ఆ సినిమాలో మంచి మ్యాటర్ ఉన్నట్లు అనిపించేలా పేరు తెచ్చుకుంది. ప్రజెంట్ తమిళ్, మలయాళంలో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న నిమిషా.. తర్వలో తెలుగులోకి అడుగుపెడుతుందోమో చూడాలి. జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూరారై పొట్రు తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆకాశమే హద్దురాతో ఇక్కడ ఆడియన్స్‌కు సుపరిచితమైన ఈ కేరళ కుట్టీ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ కేవలం తమిళ్, మలయాళ చిత్రాలతో సరిపెట్టుకుంటుంది. వీళ్లే కాదు.. తన సినీ కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా చేయని మంజు వారియర్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. వెట్టయాన్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె త్వరలో విడుదల పార్ట్ 2లో కనిపించబోతుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీలెవరు తెలుగు సినిమాలు చేయలేదు.. ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. కానీ టాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో మాత్రం గూడు కట్టుకున్నారు.

Show comments