NTV Telugu Site icon

Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం

Untitled Design (29)

Untitled Design (29)

రంగుల ప్రపంచంలో హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎందరో వస్తుంటారు. తమ ప్రతిభను నమ్ముకుని, స్వశక్తితో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారిపైనే కన్నేసే కామాంధులు కోకొల్లలు. అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్య లెక్కే లేదు. ఈ వ్యహారంపై కొందరు హీరోయిన్స్  షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి గతంలో చూసాం. ‘మీ టూ’ అంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. ఎన్ని చేసిన ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతోజరిగే మోసాల గురించి వింటూనే ఉంటాం. అలాంటి ఉదంతంతమే మరోటి వెలుగులోకి వచింది.

Aslo Read: Indian2: OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

టాలీవుడ్ లో గొప్పగా రాణించాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన యువతి పై కన్నేశాడు ఓ విశాఖపట్నంకు చెందిన సిద్దార్థ్ వర్మ(30). ఇతగాడు టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పని చేసాడు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న సిద్దార్థ్ మాయమాటలతో నమ్మించి మోసం చేసి సినిమా అవకాశాల పేరుతో యువతిపై అత్యాచారం చేసాడు.

పుప్పాలగూడ ఐటి కారిడార్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురంకు చెందిన యువతిపై కన్నేసి చాలా అందంగా ఉన్నావు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. యువతిని డిన్నర్ పేరిట తను ఇంటికి రమ్మని పిలిచాడు. సినిమాలో ఛాన్స్ నిజమని నమ్మి సిద్దార్థ్ ఇంటికి వెళ్లిన యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు సిద్దార్థ్ వర్మ. తానూ మోసపోయానని తెలుసుకున్న యువతి సిద్దార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సిద్దార్థ్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన గచ్చిబౌలి పోలీసులు.

Show comments