NTV Telugu Site icon

Tollywood : నిర్మాతలందరికి ఆ హీరోనే కావాలి.. అంత ప్రత్యేకత ఏంటో.. ?

Untitled Design 2024 08 13t074832.183

Untitled Design 2024 08 13t074832.183

టాలీవుడ్ లో ఎప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దర్శకుడు, లేదా హీరో ఒక్క హిట్ సినిమా ఇచ్చాడంటే నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్స్ లు వద్దన్న కూడా ఇచ్చేస్తారు. అలా అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించిన టైమ్ లో తీసుకున్న అడ్వాన్స్ కు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి అంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇక హీరోల సంగతి సరేసరి. చిన్న,పెద్ద బ్యానర్స్ అని తేడా లేకుండా హీరోలను లాక్ చేస్తాయి.  ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోకు మంచి గిరాకీ ఏర్పడింది.

Also Read: Megastar: ఇంద్ర రీరిలీజ్ కష్టమేనా..? సమస్య ఏంటంటే ..?

ఈ ఏడాదిలో ఇప్పటికే గామి, గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనే రెండు సినిమలు రిలీజ్ చేసాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతకు కాసింత గట్టిగానే గిట్టుబాటు అయింది. విశ్వక్ సినిమాలకు డే 1 మంచి కలెక్షన్స్ రావడంతో పాటు బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయి. దింతో విశ్వక్ ఇప్పుడు నిర్మాతలకు గోల్డెన్ స్పూన్. విశ్వక్ రామ్ తాళ్లూరి నిర్మాతగా మెకానిక్ రాకి లో నటిస్తున్నాడు. ఈ నెల 31 రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ‘లైలా’ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ రెండు కాకుండా సుధాకర్ చేరుకురి బ్యానర్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా తన కెరీర్ లో 14వ సినిమాను జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కే.వి తో చేయబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇలా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అందరు ఇప్పుడు విశ్వక్ సేన్ తో సినిమా చేసేందుకు ఎగబడుతున్నారు.

Show comments