Site icon NTV Telugu

VIJAY : నేడు విజయ్ ‘TVK’ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Tvk

Tvk

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీ కూడా స్థాపించాడు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇక రాజాకీయాలలో బిజీగా గడపబోతున్నాడు విజయ్.  విజయ్ పార్టీ స్థాపించి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా నేడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు.

Also Read : Mazaka : మజాకా ట్విట్టర్ రివ్యూ..

ఈ నేపథ్యంలో చెన్నైలోని మామల్లపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాడు విజయ్. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ,టీవీ కే పార్టీ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.  పార్టీ నేతలు, పార్టీలో పలు విభాగాలకు సంబంధించిన కీలక నేతలు,కార్యకర్తలను మాత్రమే ఆహ్వానం అందించారు. అలాగే ఈ సభకు దాదాపుగా మూడు వేలమంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్రమంతటా పాదయాత్ర లేక బస్సుయాత్ర విజయ్ చేపట్టే అవకాశం ఉందని, పొత్తులపై సైతం విజయ్ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు విజయ్ సన్నిహితులు. తమతో వచ్చే వారితో కలిసి వెళ్తామని పార్టీ ప్రకటించిన రోజే తెలిపిన విజయ్. ఏడిఎంకె తో వెళ్తారా లేక బిజెపితో అడుగులు వేస్తారా అన్నదానిపై తమిళనాడులో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల క్రితం విజయ్ భద్రత కోసం వై క్యాటగిరి సెక్యూరిటీ అనుమతి ఇచ్చింది కేంద్రం.

Exit mobile version