Site icon NTV Telugu

TJ Gnanavel : ‘మసాలా & మర్డర్స్’గా రానున్న తమిళనాడు ‘కింగ్’ బయోపిక్..

Untitled Design (6)

Untitled Design (6)

ఇటీవల బయోపిక్ ల ట్రెండ్ తగ్గింది కానీ రెండు ముడు ఏళ్ళ క్రితం ప్రతి ఇండస్ట్రీలో బయోపిక్ లు వరుసబెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో ఒకటి అరా వస్తున్నాయి కానీ అవేవి సరైన టాక్ తెచుకోవట్లేదు. తాజగా కోలీవుడ్ లో ఓ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్, లీగల్ ఇష్యూస్ మొత్తం

Also Read: V. N. Aditya : చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన హిట్ సినిమాల దర్శకుడు

ఈ బయోపిక్ ఎవరిదో కాదు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరల్డ్ ఫేమస్ శరవణ భవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్. శరవణ భవన్ రాజగోపాల్, శరవణ గోపాల్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈయనకు ‘ దోశ కింగ్’ అన్నబిరుదు కూడా ఉంది. తమిళ నాడులో 2001లో శాంతకుమార్ మర్డర్ సంచలనం రేపింది. ‘దోస కింగ్ రాజ్ గోపాల్ కు జ్యోతిష్యం అంటే విపరీతమైన పిచ్చి. ఆయన ఆస్థాన జ్యోతిష్కుడు 72 ఏళ్ల రాజగోపాల్ కు ఒక కన్నె పిల్ల ను వివాహం చేసుకుంటే ఇంకా ఎక్కువ పేరొస్తుందని చెప్పడంతో తన దగ్గర పని చేసే అసిస్టెంట్ కూతురు జీవన జ్యోతిని మూడవ భార్యగా వివాహం చేసుకోవాలని భావించి అప్పటికే పెళ్ళైన జీవన జ్యోతి భర్త శాంతకుమార్ ను హత్య చేయించాడు రాజ్ గోపాల్. ఆకేసులో జైలు పాలై 2019 లో మరణించాడు.ఈ కథాంశంతో రాజ్ గోపాల్ బయో పిక్ తెరకెక్కించనున్నాడు తమిళ దర్శకుడు టీజీ జ్ఞానవేల్. రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న వెట్టయాన్ కంప్లిట్ చేసాక ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఈ సినిమాకు ‘మసాలా & మర్డర్స్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు మేకర్స్

Exit mobile version