NTV Telugu Site icon

Thug Life : స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన థగ్ లైఫ్ టీం.. వీడియో వైరల్..

Whatsapp Image 2024 05 07 At 1.07.48 Pm

Whatsapp Image 2024 05 07 At 1.07.48 Pm

లోకనాయకుడు కమల్‌హాసన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.కమల్ హాసన్ హీరోగా నటించిన “ఇండియన్ 2 ” సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయింది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అలాగే కమల్ హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి ” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన మూవీ ‘థగ్‌ లైఫ్‌’ .ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమా కమల్ హాసన్ 234 వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు .అలాగే ఈ సినిమాలో శింబు , గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌ మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌లో జరుగుతుంది. కమల్ హాసన్, శింబు అండ్‌ టీంపై వచ్చే సీన్లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.తాజాగా లొకేషన్‌ పిక్ లీక్ అయింది.ఈ పిక్ లో కమల్ హాసన్‌ కోరమీసంతో కనిపించరు .అలాగే శింబు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌ లుక్‌ లో కనిపించారు.ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే థగ్‌లైఫ్ మూవీ నుంచి రేపు మరో ఆసక్తికర అప్‌డేట్‌ రానుంది. కొత్త ఆరంభ సమయం.. కొత్త థగ్‌కు స్వాగతం పలికే సమయం.. రేపు ఉదయం 10 గంటలకు “సిగ్మా థగ్‌ రూల్” అప్‌డేట్ రానుందంటూ ఓ వీడియోను మేకర్స్ షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.