సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించగా, రతన్ రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన అప్ డేట్ లు ఎంతో ఆకట్టుకోగా, తాజాగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Also Read: Anushka : ‘ఘాటీ’ మూవీ న్యూ అప్‌డేట్..
ఈ కార్యక్రమంలో భాగంగా లిరిసిస్ట్ రాంబాబు గోశాల మాట్లాడుతూ ‘సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ‘ఆర్టిస్ట్’ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇప్పటికే రెండు సాంగ్స్ చూస్తూ, చూస్తూ, ఓ ప్రేమా రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ నా ఫేవరేట్ సాంగ్స్. డైరెక్టర్ రతన్ రిషి మూవీని బాగా రూపొందించాడు. సంతోష్ కాల్వచెర్ల, క్రిషేక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. నటి స్నేహ మాధురి శర్మ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో ఒక కీ రోల్ లో నటించాను. నా ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రతన్ రిషి గారికి థాంక్స్’ అనగా..
హీరోయిన్ క్రిషేక పటేల్ మాట్లాడుతూ ‘ ‘ఆర్టిస్ట్’ మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్, డైరెక్టర్ రిషికి థ్యాంక్స్. జాను క్యారెక్టర్ లో మీ అందరినీ ఆకట్టుకుంటా. హీరో సంతోష్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. చాలా సపోర్టివ్ కో యాక్టర్ అతను. మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మీ అందరికీ నచ్చేలా సినిమా చేశాం. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి మా సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది.