Site icon NTV Telugu

Thrikala: డిసెంబర్‌లో ‘త్రికాల’ రిలీజ్

Thrikala

Thrikala

ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి.

Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్?

ఈ చిత్రాన్ని రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తుండగా, శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Also Read :Ram – Bhagya Sri: రామ్ తో ప్రేమ.. ఓపెనైన భాగ్య శ్రీ

మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్ మరియు శ్రద్ధా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వడంతో, ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’ బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ చిత్రం మీద మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం స్పిరిట్, పూరి-విజయ్ సేతుపతి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ, హర్షవర్దన్ రామేశ్వర్ ‘త్రికాల’ కథ నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇందులో ఆయన సౌండింగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవడంతో, చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్ని పెంచే పనిలో పడ్డారు. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేయాలని టీం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Exit mobile version