Site icon NTV Telugu

Mohan Lal : ఒకే ఏడాదిలో మూడు సెన్సేషన్ హిట్స్.. దటీజ్ మోహన్ లాల్

Mohan Lal

Mohan Lal

రీసెంట్‌గా రిలీజ్ అయిన మోహన్‌లాల్ ఫ్యామిలీ డ్రామా ‘హ్రుదయపూర్వం’ లాలట్టన్ ఎమోషనల్ సైడ్‌ని మరోసారి చూపించింది. ఫస్ట్ డే రూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. సింపుల్ స్టోరీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవే ఈ సినిమాకి హైలైట్. రివ్యూలు పాజిటివ్‌గా ఉండటంతో, లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇంకా బలంగా రాణించే ఛాన్స్ ఉంది. ‘L2 ఎంపురాన్’ మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన సూపర్ బ్లాక్‌బస్టర్. ఈద్ సీజన్‌లో ఈ సినిమాతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కేవలం కేరళలోనే రూ. 14 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు మొత్తం కలెక్షన్స్‌తో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ హోదా దక్కించుకుంది. లూసిఫర్ సక్సెస్‌కి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ, మోహన్‌లాల్ స్టార్ పవర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

Also Read : Coolie : ఫస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న కూలీ.. ఎక్కడంటే

‘L2 ఎంపురాన్’ వచ్చిన ఒక నెల గ్యాప్ లో మోహన్‌లాల్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు ‘తుడరం’ తో. ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 5 కోట్లు ఇది మలయాళ సినిమాకి మాసివ్ నంబర్ అంతేకాదు కేవలం కేరళలోనే రూ. 100 కోట్ల రికార్డు సాధించిన, ఫస్ట్ మోహన్‌లాల్ మూవీగా నిలిచింది. ఈ ఫీట్‌తో మలయాళ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. నిజంగా, ఈ సినిమా మలయాళ సినిమాకి ఒక మైలు రాయిగా నిలిచింది. టాప్ 5 లిస్టులో మిగిలిన రెండు మూవీస్ మమ్ముట్టి పేరుమీదే ఉన్నాయి. ‘బజూకా’ రూ. 3 కోట్లు కలెక్షన్‌తో నాలుగో స్థానంలో నిలవగా, ‘లోక’ రూ. 2.65 కోట్లు తో ఐదో స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా లోక స్లో అండ్ స్టెడీ గ్రోత్ చూపిస్తోంది. కానీ టాప్ 3 మూవీస్ అన్నీ మోహన్‌లాల్ సినిమాలే కావడం అది లాలట్టన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కే నిదర్శనం. 2025లో మోహన్‌లాల్ మళ్లీ మలయాళ బాక్సాఫీస్ ట్రెండ్‌సెట్టర్‌గా ప్రూవ్ చేశాడు. కేవలం ఆరు నెలలో కేరళలో రూ. 540 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ది కంప్లిట్ స్టార్ అని ప్రూఫ్ చేసారు మోహన్ లాల్.

Exit mobile version