Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhargav BV: కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ బీవీ ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు వాడే అయినప్పటికీ శాండల్‌వుడ్‌లో ఈయన క్రేజీ హీరో అయ్యాడు. ఆయన నటించిన ‘పరిశుద్ధం’ వంద రోజులు ఆడిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘టెడ్డీ బేర్’ వంటి చిత్రాలు నటుడిగా మంచి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలో ఈయన కనబరిచిన ప్రతిభకు గాను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ‘బెస్ట్ యాక్టర్’ అవార్డుతో పాటు కర్ణాటక కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. భార్గవ్ బీవీ ప్రస్తుతం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సరికొత్త ద్విభాషా చిత్రం ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ నిన్ననే (ఆగస్టు 14, 2026) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కొసల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై బండి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక పవర్ఫుల్ ఎమోషనల్ మైండ్-గేమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ చిత్రం ద్వారా భార్గవ్ టాలీవుడ్లోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండటం విశేషం.
హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందుకు ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు భార్గవ్. తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన క్లాసిక్ పాట పేరునే టైటిల్‌గా ఎంచుకోవడం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్‌లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా సినీ ప్రముఖుల సమక్షంలో శుభారంభంగా ఈ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. ఎగ్జిక్యూటివ్ నిర్మాత మద్దినేని రమేష్ మాట్లాడుతూ, భార్గవ్ తెలుగు వ్యక్తే అయినప్పటికీ కన్నడలో స్టార్ హీరోగా ఎదిగారని గుర్తు చేశారు. ఈ సినిమాను హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. నిర్మాత బండి నాగరాజు మాట్లాడుతూ, మంచి కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. హీరోగా ఇప్పటికే గుర్తింపు పొందిన భార్గవ్ దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
- Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
- Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
గ్రామీణ నేపథ్యంతో కూడిన భావోద్వేగ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’లో క్లాసిక్ టైటిల్, భార్గవ్ ద్విపాత్ర బాధ్యతలు, కొత్త జోడీ, అనుభవజ్ఞులైన నటీనటుల సమాహారం సినిమాపై మంచి అంచనాలను సృష్టిస్తున్నాయి. కన్నడలో స్టార్ ఇమేజ్ సంపాదించిన భార్గవ్ తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమాతో ఎంతగా ఆకట్టుకుంటారో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!