Site icon NTV Telugu

Vassishta : విశ్వంభర కథ ఇదే.. ఆ సినిమాకు కాపీ లాగే ఉందిగా.?

Vishwambhara

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Junior Review : జూనియర్ ఓవర్సీస్ రివ్యూ

కాగా ఈ సినిమా కథను దర్శకుడు విశిష్ట రివీల్ చేసారు. మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు పైన 7 లోకాలు. విశ్వంభర అనేది  14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం.. అదే విశ్వంభర. ఆ లోకంలో ఉండే హీరోయిన్ ను వెతుక్కుంటూ 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తెచుకున్నాడు అనేదే విశ్వంభర కథ అని చెప్పాడు. కాస్త పరిశీలీనగా చూస్తే ఈ కథ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉంది. అక్కడ హీరోయిన్ స్వర్గలోకం భూమిదకి వస్తే ఇక్కడ హీరో తన హీరోయిన్ ను తెచ్చుకోవడం కోసం విశ్వంభర లోకానికి వెళ్తాడు. అయితే తన కథ జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలిఉండదని తెలిపాడు వసిష్ఠ. అలాగే అక్కినేని నాగేశ్వరావు నటించిన కీలు గుర్రం సినిమా, ఎన్టీఆర్ పాతాళభైరవి లాంటి ఫాంటసీ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అని తెలిపాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న విశ్వంభర సెప్టెంబరులో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version