Site icon NTV Telugu

Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు

Coolie

Coolie

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది.

Also Read : Tollywood : బోయపాటి, బాబీ, గోపిచంద్, అనిల్ బిజీ.. వాట్ హ్యాపెన్ కొరటాల?

సాధారణంగా లోకి సినిమాల కథలు చూస్తే కార్తీతో చేసిన ఖైదీ లో డ్రగ్స్, కమల్ హాసన్ విక్రమ్ లో కూడా డ్రగ్స్, తుపాకులు, విజయ్ తో చేసిన మాస్టర్, లియో లోను గన్స్, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలు కథ నేపధ్యంగా ఎంచుకుంటూ హిట్స్ కొడుతూ వస్తున్నాడు. అయితే ఈ సారి లోకేష్ తన రెగ్యూలర్ ట్రాక్ ను మార్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కిస్తున్న కూలీ సినిమాలో NO GUNS.. NO DRUGS.. ఈ సారి ఏకంగా బంగారు వాచ్ లు స్మగ్లింగ్ వంటి అంశాన్ని కథ నేపథ్యంగా ఎంచుకున్నారట. లగ్జరీ వాచ్ లను విశాఖతీరం కేంద్రంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే అంశంతో రాబోతుంది. ఆ మధ్య గ్లిమ్స్ లోను వాచ్ లు పట్టుకుని రజనీకాంత్  ఫైట్ చేస్తుండే పోస్టర్స్ చుస్తే అర్ధం అవుతుంది. అయితే లోకి తన గత సినిమాల మాదిరి యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. కానీ ట్రాక్ మార్చిన లోకేష్ కనకరాజ్ హిట్ కొడితే ఓకే. రిజల్ట్ తేడా వస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

Exit mobile version