చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేటెడ్ మూవీ-ఫ్లో.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్) తో పాటు పలువురు అవార్డులు గెలుపొందారు. ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు గెలుపొందాయంటే..?
2025 ఆస్కార్ విజేతలు :
ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్ బేకర్)
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్)
ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ – ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్