They Call Him OG Movie to Release on September 27th 2024: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయం కూడా మీద అనేక చర్చలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా తెరమీదకు వచ్చింది.
Apoorva Rao: టాలీవుడ్ కి పరిచయమవుతున్న ఒంగోలు పిల్ల ‘అపూర్వ’
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన అత్తారింటికి దారేది సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ విషయానికి వస్తే కనుక ఇప్పటికే పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేశాడు సుజీత్. దీంతో జస్ట్ పవన్ 17 నుంచి 18 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అని టాక్. ఇప్పుడు పవన్ ఎన్నికల హడావిడిలో ఉన్నారు కాబట్టి… ఆ హడావుడి అయ్యాక డేట్స్ ఇస్తే వెంటనే ఓజిని పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.