LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లా అండ్ ఆర్డర్‘ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో రన్ అవుతోంది. విడుదలకు ముందు ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ కేరళ మార్కెట్లో తొలి రోజు కేవలం రూ. 20 లక్షల ఓపెనింగ్ తెచ్చుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. ఇక రెండో రోజు నాటికి పరిస్థితి మరింత దిగజారి దాదాపు 25% మేర డ్రాప్ అయి కేవలం రూ. 15 లక్షల రేంజ్‌కే పరిమితమైంది. దీంతో తొలి రెండు రోజుల్లో కేరళ మొత్తం గ్రాస్ కేవలం రూ. 35 లక్షల రేంజ్‌కి మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజులకు కలిపి సుమారు రూ. 55 లక్షల మార్కును దాటలేకపోయింది.
కేరళ పరిస్థితి ఇలాఉంటె రెస్టాఫ్ ఇండియా ఈ సినిమా పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్ షేర్ కేవలం రూ. 88,500 మాత్రమే నమోదు కావడం గమనార్హం. డే-1 నైట్ షోలు పడకముందే ఈ ప్రాంతాలలో థియేటర్లు ఖాళీ అయి, సినిమా దాదాపుగా “వాష్ అవుట్” అనే స్టేజ్ కి వచ్చేసింది. ఈసినిమా టాక్, కలెక్షన్స్ చూస్తే, ఈ సినిమాకు లాంగ్ రన్ లభించే అవకాశాలు అస్సలు లేవు. వర్డ్ ఆఫ్ మౌత్ నెగెటివ్‌గా ఉండటం, వీకెండ్ తర్వాత షోల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండం చూస్తే ఫైనల్ రన్ లో రూ. 1 కోటి గ్రాస్ సాధించడం కూడా దాదాపుగా అసాధ్యం అని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఐకానిక్ రోల్ కరిక్కమూరిగా అతిధి పాత్రలో కనిపించారు. స్టార్ హీరో నటించిన సినిమాకు ఈస్థాయి కలెక్షన్స్ అంటే ఆడియెన్స్ స్టార్ కంటే కంటెంట్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు.
Also Read
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
తాజావార్తలు
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!