Site icon NTV Telugu

థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?

Theatres

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్స్ ను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. దానికి కారణం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతినివ్వడం, ఆంధ్రప్రదేశ్ కేవలం మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి విషయాలు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం అన్ని ప్రదర్శనలను అనుమతించినప్పటికి రాత్రి 10 నుండి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలపై థియేటర్ యజమానులు అసంతృప్తితో ఉన్నారు.

Read Also : ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”

ఈ విషయంపై ఓ ఎగ్జిబిటర్ మాట్లాడుతూ “థియేటర్లు ఒక సంవత్సరం పాటు తెరవలేదు. ఆస్తిపన్ను, కనీస విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి. సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితిలో టికెట్ ధరలను తగ్గించడంతో పెద్ద స్క్రీన్‌లను నడపడం కష్టమవుతుంది”అని అన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు మరియు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి టికెట్ ధరలపై తీర్మానానికి వచ్చిన తర్వాతే థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ‘లవ్‌స్టోరీ’, ‘విరాటా పర్వం’ వంటి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని విడుదల చేయడానికి నిర్మాతలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా థియేటర్లు తిరిగి తెరవడానికి మరో నెల రోజులు పట్టవచ్చని, వినాయక చతుర్థి తర్వాత దానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎగ్జిబిటర్లు చెబుతున్న మాట.

Exit mobile version