థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్స్ ను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. దానికి కారణం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతినివ్వడం, ఆంధ్రప్రదేశ్ కేవలం మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి విషయాలు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం అన్ని ప్రదర్శనలను అనుమతించినప్పటికి రాత్రి 10 నుండి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలపై థియేటర్ యజమానులు అసంతృప్తితో ఉన్నారు.
Read Also : ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”
Also Read
- IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
- Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
- Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ఈ విషయంపై ఓ ఎగ్జిబిటర్ మాట్లాడుతూ “థియేటర్లు ఒక సంవత్సరం పాటు తెరవలేదు. ఆస్తిపన్ను, కనీస విద్యుత్ ఛార్జీలు చెల్లించాలి. సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితిలో టికెట్ ధరలను తగ్గించడంతో పెద్ద స్క్రీన్‌లను నడపడం కష్టమవుతుంది”అని అన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు మరియు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి టికెట్ ధరలపై తీర్మానానికి వచ్చిన తర్వాతే థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ‘లవ్‌స్టోరీ’, ‘విరాటా పర్వం’ వంటి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని విడుదల చేయడానికి నిర్మాతలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా థియేటర్లు తిరిగి తెరవడానికి మరో నెల రోజులు పట్టవచ్చని, వినాయక చతుర్థి తర్వాత దానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎగ్జిబిటర్లు చెబుతున్న మాట.
తాజావార్తలు
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
-
Annamalai: కొత్త పార్టీ పెడతారా?.. బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారా? అన్నామలై నిర్ణయంపై ఉత్కంఠ..!
-
Vaibhav Sooryavanshi Earnings: ఐపీఎల్ 2026లో వైభవ్ ఎంత సంపాదించాడో తెలుసా?.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
-
Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!