ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ రియాలిటీ షోలో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. హీరో తేజ సజ్జా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా మైండ్ గేమ్స్, వ్యూహాలకు తోడు ఇప్పుడు కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత విమర్శలు కూడా మొదలయ్యాయి. తాజాగా హౌస్‌లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ సంభాషణ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంటెస్టెంట్ శ్రీదేవి చౌదరి, తోటి కంటెస్టెంట్ వర్ష డిసౌజా వాడే వస్తువులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. ప్యాలెస్‌లోని బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉన్న సమయంలో శ్రీదేవి చౌదరి కన్ను.. రాహత్ అచంట దగ్గర ఉన్న ఓ హెయిర్ క్లిప్‌పై పడింది. ఆ క్లిప్ చూసిన వెంటనే శ్రీదేవి.. “ఏంటి ఈ చీప్ క్లిప్ ఇక్కడుంది? ఇది ఎవరిది?” అంటూ రాహత్‌ను ప్రశ్నించింది. దానికి బదులుగా రాహత్.. ఆ క్లిప్ వర్ష డిసౌజాది అని, ఆమె తనను కాసేపు పట్టుకోమని ఇచ్చిందని బదులిచ్చాడు. అసలు రచ్చ అక్కడే మొదలైంది.
ఆ క్లిప్ వర్షది అని తెలియగానే శ్రీదేవి మాటల డోస్ పెంచేసింది. ఆ హెయిర్ క్లిప్ చూడ్డానికి చాలా ‘చీప్’గా ఉందని, అదొక ‘మిడిల్ క్లాస్’ ఐటెమ్ అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు, ఆ చీప్ క్లిప్‌ను వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయాలంటూ రాహత్‌కు ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఏమాత్రం ఆలోచించకుండా శ్రీదేవి చేసిన ఈ ‘మిడిల్ క్లాస్’, ‘చీప్’ కామెంట్స్ హౌస్‌లో ఒక్కసారిగా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి. క్యాజువల్‌గా మొదలైన ఈ సంభాషణ క్షణాల్లోనే సీరియస్ టర్న్ తీసుకుంది. ప్యాలెస్‌లో ఇప్పటికే ఒకరిపై ఒకరికి అనుమానాలతో గేమ్ నడుస్తుండగా.. ఇలా ఒకరి వస్తువులను ‘చీప్’ అంటూ క్లాస్ ఫీలింగ్ చూపించడం రాబోయే ఎపిసోడ్స్‌లో ఎలాంటి చిచ్చు రేపుతుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. వర్ష డిసౌజా ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సోల్ (SOL) ప్రొడక్షన్ నిర్మాణంలో రూపొందిన ఈ మైండ్ గేమ్ రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉన్న ఈ షో కొత్త ఎపిసోడ్స్ ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయి.

