కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం.
కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్టింగులు మధ్య ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాకు కిరణ్ కాబోయే శ్రీమతి రహస్య గోరక్ అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తునట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రంతో కిరణ్ కు హిట్ ఇవ్వాలని ఔట్ పుట్ లో ఎక్కడా కంప్రమైస్ కాకుండా తెరకెక్కిస్తున్నారు . ఈ ఏడాదిలోనే షూటింగ్ కంప్లీట్ చేసి విడుదలకు సన్నాహాలు చేస్తోంది యూనిట్.
SR కల్యాణ మండపంతో హిట్ కొట్టిన ఈ హీరో మళ్లీ కెరీర్ లో ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు అన్నీ ఒకేరకం కథలతో ఏడాదికి రెండు, మూడు చిత్రాలతో బాక్సాఫీస్ ఫై దండయాత్ర చేసాడు. కాని ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. కొన్ని చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించిన ప్రజయోజనం దక్కలేదు ఈ యంగ్ హీరోకి. ఫలితంగా హిట్ రేస్ లో వెనకబడ్డాడు. కొంత గ్యాప్ తో పీరియాడికల్ కథతో వస్తున్న ‘క’ చిత్రంతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఆశిద్దాం. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగాశ్రీచక్ర బ్యానేర్ పై చింతా గోపాల కృష్ణ రెడ్డి సమర్పిస్తున్నారు.
Also Read మా అల్లుడు వెరీగుడ్.. కెజిఎఫ్ – 2 తర్వాత కల్కి మాత్రమే..