Site icon NTV Telugu

Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..

Untitled Design (4)

Untitled Design (4)

గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని.

Also Read: Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

లోకేష్ సినిమా  ‘కూలి’ టైటిల్ టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఈ చిత్ర షూటింగ్ తర్వాతి షెడ్యూల్ వైజాగ్ లో జరగనుంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు పోర్ట్ సంభందిత సన్నివేశాలను వైజాగ్‌లో చిత్రీకరించనుంది కూలి టీమ్. ప్రసుతం వైజాగ్ చుట్టుపక్కల లొకేషన్స్ వేటలో ఉన్నాడు దర్శకుడి లోకేష్. వైజాగ్ లో దాదాపు 40 రోజులు పాటు షూటింగ్ కొనసాగుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. వెట్టయ్యన్ షూటింగ్ చివరి దశలో ఉందని, రజనికి సంబంధించి కేవలం కొద్దీ రోజులు షూట్ బాలెన్స్ ఉంది. దీంతో గ్యాప్ తీసుకోకుండా షూట్ స్టార్ట్ చేసేందుకు తన నెక్ట్స్ సినిమా  కూలి కోసం 160 రోజుల కాల్షీట్‌ను కేటాయించారు రజనీకాంత్. చక చక షూటింగ్ కంప్లిట్ చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది నిర్మాణ సంస్థ. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ సంగీతం అందిసున్నాడు.

Exit mobile version