The Red Bag: ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్

The Red Bag

The Red Bag

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 21న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయబోతోంది.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ మరియు టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. శేఖర్ మోపురి స్వరపరిచిన పాటలు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో ట్రెండింగ్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందించగా, శివ శర్వాణి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.