మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాతగా రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఒక ఊపునిచ్చే మాసీ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘డిస్కో లైట్’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పక్కా పార్టీ వైబ్ ఇస్తోన్న ఈ పాటలో నటుడు కబీర్ సింగ్‌తో పాటు హీరోయిన్లు తమ ఊపుతో స్క్రీన్‌పై సందడి చేశారు.
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ అందించిన క్యాచీ పదాలు యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సింగర్ గీతా మాధురి తన పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటకు ప్రాణం పోశారు. శేఖర్ మోపురి అందించిన బాణీలు ఎంతో హుషారుగా ఉండి, ఇన్‌స్టంట్‌గా చార్ట్‌బస్టర్‌గా నిలిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో జోరుమీదున్న చిత్రబృందం, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. వరుస అప్‌డేట్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ది రెడ్ బ్యాగ్’ సినిమాపై ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి అని చెప్పొచ్చు.

