The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ కథ లీక్.. నిర్మాత కాపీ ఆరోపణలు!

  • మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్
  • సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇదే అంటూ ఐఎండీబీలో ఒక కొత్త అప్డేట్
  • ఈ సినిమాకి కూడా కాపీ చేసినట్టున్నారు అంటూ ఎస్కేఎన్ కామెంట్స్
The Rajasaab

The Rajasaab

The RajaSaab storyline in IMDB is Copied Says Co Producer SKN: ఈ మధ్యనే కల్కి 2898 ఏడి అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 550 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటేసి మరిన్ని కలెక్షన్లు రాబట్టే దిశగా దూసుకుపోతోంది. ఆ సంగతి అలా ఉంచితే ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు రాజాసాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో పాటు మారుతి టీం వర్క్స్ సంస్థ కూడా నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమా అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు. చాలా పగడ్బందీగా సినిమాకి సంబంధించిన విషయాలు ఏమాత్రం బయటికి రాకుండా చూసుకుంటూ సినిమా యూనిట్ షూటింగ్ ముగిస్తోంది.

Prisha Singh: ఈ కొత్త పిల్ల ఏంట్రా ఇంత హాటుగా ఉంది..

అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇదే అంటూ ఐఎండీబీలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఒక జంట విధిని ఎదురించి నెగిటివ్ ఫోర్సెస్ ను దాటుకుని ఎలా ఒక్కటయింది అనేది ఈ సినిమా లైన్ గా ఐఎండీబీలో పేర్కొన్నారు. ఇదే ఈ సినిమా కథ అని అంటూ ఒక ట్విట్టర్ పేజీ పోస్ట్ చేయగా దానికి ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ స్పందించాడు. ఐఎండీబీలో టీం పొరపాటున రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన లైన్ ని ఈ సినిమాకి కూడా కాపీ చేసినట్టున్నారు అంటూ ఆ లైన్ కరెక్ట్ కాదు అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నిజానికి రాధేశ్యామ్ సినిమాకి సంబంధించి ఐఎండిబిలో ఈ లైన్ లేదు వేరే విధంగా సినిమాని వర్ణించారు. అయితే రాజా సాబ్ మాత్రం ఈ చెబుతున్న విధిని, నెగిటివ్ ఫోర్సెస్ ను ఎదిరించి జంట ఏకమయ్యే లైన్లో లేదనే విషయాన్ని మాత్రం ఎస్కేన్ చెప్పినట్లయింది. మరి ఒరిజినల్ లైన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఇక సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో సినిమా యూనిట్ ఉంది. అయితే అది ఎంతవరకు పాజిబుల్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.