Site icon NTV Telugu

The Raja Saab-Prabhas: మూడేళ్ల తర్వాత.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

The Raja Saab Pre Release Event

The Raja Saab Pre Release Event

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ మధ్యకు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆల్మోస్ట్ రెండు మూడేళ్లు కావొస్తుంది. ‘సలార్’ లాంటి సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు. ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేయడానికి వచ్చాడు డార్లింగ్. అది తప్పితే.. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌లలో పెద్దగా కనిపించలేదు. ఇది కాస్త రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను బాధించింది. ఇక మా హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చూడలేమా? అనే డైలమాలో పడిపోయారు అభిమానులు. కానీ మారుతి మాత్రం మీకు వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేశాడు. ఫ్యాన్స్ వద్దని చెప్పినా సరే.. పట్టుబట్టి మరీ ఈ సినిమా చేశాడు డార్లింగ్.

మారుతి కూడా కొడితే కంటెంట్‌తో కొడతానని.. ఫస్ట్ టైం ప్రభాస్‌ చేత హార్రర్ కామెడీ చేయిస్తున్నాడు. అంతేకాదు బాహుబలి తర్వాత హీరోయిన్లతో రొమాన్స్ చేసే ఛాన్స్ లేకుండా పోయిన ప్రభాస్‌కు.. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌తో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తుండగా.. డిసెంబర్ 27న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కైతలాపూర్‌లో సాయత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్ వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: The Raja Saab: అలాంటి ఎపిసోడ్‌ ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు: మారుతి

ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ ముగించిన ప్రభాస్.. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ సినిమా లుక్ రివీల్ కాలేదు కానీ.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డార్లింగ్ పోలీస్ లుక్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా రాజా సాబ్‌తో రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు సంక్రాంతి వైబ్ స్టార్ట్ అయినట్టే.

Exit mobile version