‘రెబల్ స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read: Kiara Advani: సౌత్‌లో సరైన హిట్టు లేకపోయినా.. ‘టాక్సిక్’ కోసం కియారా అన్ని కోట్లు తీసుకుందా?
రాజా సాబ్ లుక్‌లో ప్రభాస్‌ను ప్రేక్షకులు చాలా ఏళ్లు గుర్తుపెట్టుకుంటారని డైరెక్టర్ మారుతి చెప్పారు. ‘ఎంటర్‌టైన్ చేసే ప్రభాస్ గారిని తెలుగు ఆడియన్స్ చూశారు కానీ.. పాన్ ఇండియాలో ఎవరూ చూడలేదు. ఈ సినిమాతో అందరూ ప్రభాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూస్తారు. మీరు సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజా సాబ్ లుక్‌లో ప్రభాస్‌ను కొన్ని సంవత్సరాలు గుర్తుంటారు. సినిమాలో హారర్ ఎపిసోడ్ వినోదాన్ని పంచుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై అలాంటి ఎపిసోడ్ రాలేదు’ అని మారుతి చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 – 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟑 💥💥#Prabhas in a MOST ENTERTAINING show for the PAN INDIA audience ❤️🔥❤️🔥#TheRajaSaab pic.twitter.com/lG0tsF0ijf
— People Media Factory (@peoplemediafcy) December 26, 2025
