NTV Telugu Site icon

Producer : బన్నీ లుక్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత

Allu Arjun

Allu Arjun

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తో వస్తాడు అనుకుంటే కథ విషయంలో ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో రాబోతున్నాడు. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ లుక్ గురించి నిర్మాత క్రేజీ అప్ డేట్ లీక్ చేశారు.

మనకు తెలిసి తన ప్రతి ఒక మూవీలో అల్లు అర్జున్ తన లుక్ విషయంలో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా మూవీ మూవీ కి అతను ఏదో ఒక స్టైల్‌లో కనిపిస్తాడు. ఇక రీసెంట్‌గా ‘పుష్ప’ లో డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాడు.ఈ రెండు అతనికి మూవీలో చాలా ప్లస్ అయ్యాయి. ముందు చిత్రాల్లో కూడా డ్రెసింగ్‌ విషయంలో బన్నీ పెట్టింది పేరు. అందుకే అతనికి స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా మైత్రి నిర్మాత రవి శంకర్ ‘అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో లుక్ ఊహించని విధంగా ఉంటుంది,ఇప్పుడు బన్నీ ఆ లుక్ ప్రిపేర్ చేసే పనిలోనే ఉన్నారు’ అంటూ క్రేజీ అప్డేట్ అందించారు. ఆ లుక్ లో హీరో అందరికీ షాక్ ఇస్తారు. అంటూ కామెంట్స్ చేశారు. ఈ మాటలు ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి. ఇంతకీ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో చూడాలి.